బుల్లితెర నటి శ్రీవాణి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితురాలైన ఆమె తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో ఆమె భర్త మాట్లాడుతూ శ్రీవాణి వారం రోజుల నుంచి మాట్లాడలేకపోతోందని తెలిపారు. కొంచెం గట్టిగా మాట్లాడినా, ఆమె గొంతు శాశ్వతంగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు కొన్ని రోజుల పాటు మాట్లాడకూడదని సూచించినట్లు చెప్పారు.