నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమా సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో జరుగుతోంది.ఈ క్రమంలో బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారు.అయితే బాలయ్యను చూసేందుకు వచ్చిన అభిమానుల్లో ఓ బామ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నడిరోడ్డుపై జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.