తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా చిత్రీకరణను నిలిపివేసి నిర్మాతలందరితో సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు.భారీ బడ్జెట్ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.దీని ప్రభావం చాలా సినిమాలపై పడుతుంది. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.