మాస్ రాజా రవితేజ నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" నుండి ఈ రోజు ఉదయం 11:07 గంటలకు ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది. మరి, అది దేని గురించి అన్నది మేకర్స్ తెలపలేదు. ఆల్రెడీ రామారావు నుండి పలు పోస్టర్లు, లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్...ఇలా అన్ని వచ్చేసాయి. ఆఖరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. మరి, ఈ స్పెషల్ ఎనౌన్స్మెంట్ దీనిగురించి అయ్యుంటుందని అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి శరత్ మండవ డైరెక్టర్. RT టీం వర్క్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే, ఈ చిత్రం రేపు కాక ఎల్లుండి అంటే జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.