ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ బింబిసార రిలీజ్ ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5:09 గంటలకు డిజిటల్ లాంచ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. జూలై 29వ తేదీన హైదరాబాద్, శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరై కళ్యాణ్ రామ్ కు గట్టి సపోర్ట్ ఇవ్వనున్నాడు.
కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ సినిమాలో క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.