నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న బింబిసార చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంయుక్తా మీనన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. ఇక బింబిసారుడి పాత్రలో కల్యాణ్ రామ్ జీవించారని పేర్కొన్నారు. ఆయన కళ్లలో చాలా పవర్ ఉందని, తోటి నటీనటులను ఆయన ఎంతో గౌరవిస్తారని సంయుక్తా వెల్లడించారు.