మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో హీరోయినిగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.