అక్కినేని నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఇటీవల విడుదలైన "థాంక్యూ". విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా, అవికా గోర్, మాళవిక నాయర్ కీలకపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా, దిల్ రాజు నిర్మించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఫైనల్ థియేట్రికల్ వెర్షన్లో సుమారు ఆరు కోట్ల విలువ చేసే ఫారిన్ ఎపిసోడ్ ను కావాలనే నిర్మాత దిల్ రాజు కట్ చేయించారట. సినిమాకు సంబంధంలేని, అవసరం లేని నెరేషన్ తో సాగే ఈ ఎపిసోడ్ నిడివి సుమారు అరగంట. ఈ అరగంట ఎపిసోడ్ ను కట్ చెయ్యడం వల్లే థాంక్యూ కేవలం రెండు గంటల తొమ్మిది నిమిషాల వ్యవధితో థియేటర్లలో విడుదలైంది. రచయిత BVS రవి ఈ స్క్రిప్ట్ ను యూనివర్సల్ రీచ్ తో రచించారట. దర్శకుడి టేకింగ్ లోపం వల్లనే థాంక్యూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుందని చాలామంది అభిప్రాయం.