ఇటీవల విడుదలైన "బింబిసార" ట్రైలర్ కు ప్రేక్షకులు ఎంతటి విశేష స్పందన కనపరిచారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 24గంటల్లో 9.3 మిలియన్ వ్యూస్ తో బింబిసార ట్రైలర్ సినిమాపై ఉన్నపళంగా భారీ అంచనాలను నమోదు చేసింది. ట్రైలర్ కు ముందు వరకు కూడా ఈ సినిమాపై అంత బజ్ లేదు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మరొక ట్రైలర్ రాబోతుంది. రిలీజ్ ట్రైలర్ పేరిట రేపు సాయంత్రం 05: 09 నిమిషాలకు సెకండ్ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ కొంచెంసేపటి క్రితమే స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.