హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం "సీతారామం". స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ తమిళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేజిక్కుంచుకుందని తెలుస్తుంది. ఈ మేరకు లైకా సంస్థ ట్విట్టర్ ద్వారా స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కాబోతుంది.