అంతకుముందు వరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ "కలర్ ఫోటో" సినిమాతోనే తెలుగమ్మాయి చాందినీ చౌదరి లైమ్ లైట్ లోకొచ్చింది. ఆ తరవాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో కలిసి "సమ్మతమే" లో నటించింది.
లేటెస్ట్ గా చాందిని కోలీవుడ్ డిబేట్ చేయబోతోందని తెలుస్తుంది. ఈ మేరకు చాందిని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ సినిమాలో చాందిని ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలిపింది. ఈ సినిమాకు CS కార్తికేయన్ దర్శకుడు. చాందినితో పాటు ఇంకా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు మేఘా ఆకాష్ కాగా, మరొకరు కార్తీక మురళీధరన్. ఈ మూవీకి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.