ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీతారామం ట్రైలర్ విడుదలై యూట్యూబులో మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోతుంది. వార్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఎపిక్ లవ్ స్టోరీగా, రిచ్ విజువల్స్ తో, సూథింగ్ మ్యూజిక్ తో... ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటివరకు 8.5 మిలియన్ వ్యూస్, 204కే లైక్స్ తో యూట్యూబులో దూసుకుపోతుంది.
"మహానటి" తదుపరి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు స్క్రిప్ట్, డైరెక్షన్ 'అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి అందించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, రష్మిక మండన్నా కీరోల్ ప్లే చేసింది. ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది.