సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఈ రోజు 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీతారామం మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. అలానే, సీతారామం సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. దీంతో ఈ రెండు విషయాలు తెలిపేలా ఒకే పోస్టర్ ను విడుదల చేసారు. చాన్నాళ్ల తర్వాత సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా ఇది.
హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన క్లాస్సీ లవ్ స్టోరీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు.