ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరు తెచ్చే వెంక‌ట ల‌క్ష్మీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 11:41 AM

పూర్తి కామెడీతో వేర్‌ ఈజ్‌ వెంకట లక్ష్మి చిత్రం రూపొందుతోందని టైటిల్‌ పాత్రధారి రాయ్‌లక్ష్మి వెల్లడించారు. రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ నాయకానాయికలుగా కిషోర్‌కుమార్‌ దర్శకత్వంలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్‌.ఆనంద్‌రెడ్డి, ఆర్‌.కె.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం లోగోను హైదరాబాద్‌లో విడుదలచేశారు. ఈ సందర్భంగా రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ, ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్‌ పాట చిత్రానికి ఓ హైలైట్‌గా నిలుస్తుంది. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుంది అని అన్నారు. దర్శకుడు కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ, కామెడీ థ్రిల్లర్‌ కథాచిత్రమిది. ప్రేక్షకులను బాగా నవ్వించాలని చేస్తున్న ప్రయత్నమిది. రింగా…రింగా…రత్తాలు పాట మాదిరిగానే ఈ మాస్‌ పాట కూడా పాపులర్‌ అవుతుంది అని అన్నారు. గురునాథరెడ్డి మాట్లాడుతూ, అమలాపురంలో 20 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో శేఖర్‌ మాస్టర్‌ నృెత్య దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. దీని తర్వాత మరో పది రోజుల పాటు అమలాపురంలో షూటింగ్‌ చేయబోతున్నాం. దాంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మిగతా కార్యక్రమాలను పూర్తిచేసి, దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం అని చెప్పారు.నిర్మాతల్లో ఒకరైన ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ, అందరి సహకారంతో చిత్రం చాలాబాగా వస్తోందని అన్నారు. ఇప్పుడు తీస్తున్న మాస్‌ పాట కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశామని, లక్ష్మీరాయ్‌తో పాటు పలువురు సీనియర్‌ నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మిగతా నిర్మాతలతో పాటు రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ, పంకజ్‌ కిషోర్‌, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ చిత్రానికి సంగీతం: హరి గురువ, సినిమాటోగ్రఫీ:వెంకట్‌ ఆర్‌.శాఖమూరి, ఎడిటింగ్‌:ఎస్‌.ఆర్‌. శేఖర్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌ సుంకర.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa