ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరాకి నాని బ్యాటింగ్ స్టార్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 26, 2018, 03:38 PM

నేచురల్ స్టార్ నాని ఒకదాని వెంట ఒకటిగా వరుసగా సినిమాలకు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జునతో కలిసి నటించిన `దేవదాస్` (సెప్టెంబర్ 27న) రిలీజవుతోంది. ఈ సినిమా తర్వాత వెంటనే నాని నటించే సినిమా ఏది? అంటే దానిపై నేచురల్ స్టార్ స్వయంగా ఓ క్లారిటీ ఇచ్చేశారు.


 నేడు హైదరాబాద్- అన్నపూర్ణ ఏడెకరాల్లో జరిగిన ఇంటర్వ్యూలో నాని `దేవదాస్` చిత్రం గురించి మాట్లాడుతూ .. పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు. అసలు కింగ్ తో మల్టీస్టారర్ చేయడం ఎలా ఉంది? అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు నాని. ``నేనేం ఇమేజ్ డ్రివెన్ ఆర్టిస్టును కాను. ఏదో కటౌట్ చూసి నా సినిమాలకు రారు. ఉదయాన్నే విజిల్స్ ని ఆస్వాధించాలని కూడా ఎవరూ అనుకోరు. జనం సినిమాను సినిమాగా చూడ్డానికి వస్తారు. అలా అనుకునే ఈ సినిమాను చేశాను. నాగ్ సార్ యాడ్ కావడం సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది`` అనీ అన్నారు. 


తదుపరి జెర్సీ వివరాలు చెబుతారా? అంటే.. విజయదశమికి `జెర్సీ` షూటింగ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రతిరోజూ మూడున్నర గంటల సేపు క్రికెటర్ గా ట్రెయినింగ్ తీసుకుంటున్నానని నాని అన్నారు. ఈ చిత్రం నా కెరీర్లో అన్నీ కుదిరిన సినిమా. బ్యాట్స్ మ్యాన్ గా కనిపిస్తాను. కెరీర్ లో గుర్తుంచుకునే సినిమా అవుతుంది.. అన్నారు. వైజయంతి బ్యానర్ అంటే సొంత బ్యానర్ అని - అశ్వనిదత్ తనని సొంత మనిషిలా చూస్తారని అన్నారు. దేవదాస్ నవ్విచే సినిమానే కాదు నవ్వులతో పాటు ఏడిపించే సినిమా కూడా అని ఎమోషన్ ఆకట్టుకుంటుందని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa