ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి సరసన నటించాలనుంది

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 26, 2018, 04:44 PM

తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తన మనసులోని మాటను మీడియాతో ముచ్చటించారు. అందమంటే మంచి ఆలోచనలకు ప్రతిరూపమని, అదే మన ముఖం మీద ప్రతిబింబిస్తుందని రాధిక అన్నారు. బాలీవుడ్ హీరోలు రాజ్‌కుమార్‌రావ్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌లతో నటించాలని ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉంటున్నానన్న ఆరోపణలను ఆమె ఖండించారు. వీలు దొరికినపుడు విహార యాత్రలకు వెళుతుంటానని, చదువును కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. రాధికా ఆప్టే హీరో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలలో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa