ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్లో నేను లీడర్‌ని

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 27, 2018, 11:15 AM

నివేథా థామస్‌ పేరు చెప్పగానే జెంటిల్‌మెన్‌, నిన్నుకోరి, జై లవకుశ చిత్రాల్లో ఆమె నటన గుర్తుకువస్తుంది. ప్రస్తతం కల్యాణ్‌ రామ్‌ సినిమాలో నాయికగా నటిస్తోంది. ప్రస్తుత హీరోయిన్లలో అభినయం విషయంలో నివేథా కు మంచి మార్కులు పడతాయి. అందుకే ఆమెకు అలాంటి పాత్రలే లభిస్తున్నాయి. ఓ పక్కన చదువు, మరోపక్క నటన ఇలా రెండు పడవలమీద ప్రయాణం చేస్తోంది. కెరీర్‌కు ఇస్తున్న ప్రధాన్యత చదువుకు కూడా ఇవ్వడం అంటే యువతకు స్ఫూర్తిదాయకమే. భవిష్యత్తుపై స్పష్టత ఉన్న నివేదకు బాల్యం నుండి లీడర్‌షిప్‌ క్వాలిటీ ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. స్కూల్లో నేను లీడర్‌ని. తప్పు చేసిన వారిని మందలించేదాన్ని. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. టీనేజ్‌ వయస్సులో కరాటే కూడా నేర్చుకున్నాను. నాతో తేడాగా ప్రవర్తిస్తే వారికి నా కరాటే దెబ్బలు తప్పేవి కాదు. నా హడావుడి చూసి కొందరు నన్ను రౌడీలా ప్రవర్తిస్తున్నావు అనే వారు. సరదాగా లేండి అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa