సుధీర్ బాబు .. నభా నటేశ్ జంటగా ఈ నెల 21వ తేదీన 'నన్ను దోచుకుందువటే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తొలి రోజునే పాజిటివ్ టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ లేకపోయినా .. వసూళ్ల పరంగా నిలకడతో ముందుకు వెళుతోంది. దాంతో ఈ సినిమాకి నిర్మాత కూడా అయిన సుధీర్ బాబు .. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సక్సెస్ మీట్ కి మహేశ్ ను రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడట. మహేశ్ బాబు వచ్చి ఈ సినిమా గురించి ఓ నాలుగు మాటలు చెబితే, థియేటర్స్ కి వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట. హీరోగాను .. నిర్మాతగాను సుధీర్ బాబుకి సక్సెస్ దక్కాలనే ఉద్దేశంతో మహేశ్ బాబు రంగంలోకి దిగుతున్నాడనే చెబుతున్నారు. త్వరలోనే సక్సెస్ మీట్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa