ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పంచారు. గత వారంలో ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న సునీల్ రోల్ ను రివీల్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా మరొక ఇంపార్టెంట్ రోల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు.
హీరోయిన్ పూర్ణ ఈ సినిమాలో వసుంధర అనే రోల్ లో నటించబోతున్నట్టు తెలిపి, ఆమెకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa