మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం "రంగరంగ వైభవంగా". తమిళ అర్జున్ రెడ్డి ని తెరకెక్కించిన గిరిశాయ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మేకర్స్ థర్డ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. సిరిసిరి మువ్వల్లోన అని సాగే ఈ పాటను జావేద్ అలీ, శ్రేయా ఘోషల్ ఆలపించారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ సాంగ్ గా చిత్రీకరించబడిన ఈ పాట యొక్క విజువల్స్ అందంగా ఉన్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa