‘అతిపెద్ద బ్లాక్‌బస్టర్ రాబోతోంది’ అని క్యాప్షన్ ఇస్తూ సూపర్‌స్టార్లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు దర్శక-నిర్మాత కరణ్‌జోహోర్. ఈ చిత్రంలో సూపర్ స్టార్లు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, దీపిక పదుకొణె నటించబోతున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఈ ఊహాగానాలకు తెరతీస్తుంది. అయితే ఈ ఫొటో వెనుక మరో విషయం కూడా ఉంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల కాబోతోంది. గత రాత్రి ఈ ట్రైలర్‌ను ముంబయిలోని రణ్‌బీర్ కపూర్ నివాసంలో ప్రదర్శించారట. ట్రైలర్ చూడటానికి వారంతా రణ్‌బీర్ నివాసానికి వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా అందరూ కలిసి ఫొటో దిగారు. బహుశా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోబోతోంది అని చెప్పడానికి కరణ్ పై విధంగా క్యాప్షన్ ఇచ్చి ఉండవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa