పలువురు క్రీడాకారిణుల బయోపిక్ లు తీసేందుకు ఫిలింమేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా – క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరహా బయోపిక్ లలో నటించేందుకు ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తి చూపించడం విశేషం. ఇటీవలే ఓ చిట్ చాట్ లో పూజా మాట్లాడుతూ సానియా – మిథాలీ రాజ్ బయోపిక్ లు తీస్తే నటించాలన్న ఆసక్తి ఉందని వెల్లడించారు. క్రీడాకారులు – అథ్లెట్ల బయోపిక్ లు చేస్తానని తెలిపారు. పూజా బాడీ లాంగ్వేజ్ అథ్లెటిక్ తరహా కాబట్టి అందుకు సూటవుతుందనడంలో సందేహమే లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa