ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌యప్ర‌కాష్ రెడ్డికి అక్కినేని లైఫ్ టైమ్ అవార్డు

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 28, 2018, 02:46 PM

విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జయప్రకాష్‌రెడ్డికి అరుదైన అవార్డు వరించింది. ఫిల్మ్‌ ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌)-అక్కినేని 2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. సినీ, టీవీ, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ‘ఫాస్‌’ గత 20ఏండ్లగా ఘనంగా సన్మానిస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఫాస్‌-అక్కినేని 2018 అవార్డులను అందించ నున్నట్టు ఫాస్‌ అధ్యక్షులు కె.ధర్మారావు తెలిపారు.


‘ఈ నెల 30న ఆదివారం సాయంత్రం విజయ వాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగే ఈ వేడుకలో ఎ.పి.ఎస్‌. ఆర్‌.టి.సి చైర్మెన్‌ వర్ల రామయ్య అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు’ అని కె.ధర్మారావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa