వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మించిన చిత్రం "సీతారామం". తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఆగస్టు 5న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి డైరెక్టర్ కాగా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక మండన్నా , సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలు పోషించగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి విడుదలైన థర్డ్ లిరికల్ సాంగ్ "ఓహ్ ప్రేమా" అనే విరహగీతం యూట్యూబులో 3 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. కధానుగుణంగా, కథతో పాటు ట్రావెల్ అయ్యే ఈ పాట ప్రేక్షకుల హృదయాలను కరిగిస్తుంది. ఈ పాటను కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద కలిసి ఆలపించగా, కృష్ణకాంత్ సాహిత్యమందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa