"ప్రిన్స్" తో టాలీవుడ్ డిబట్ చెయ్యబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే మరొక తెలుగు సినిమాను కూడా ప్రకటించారు. మడోన్నా అశ్విన్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న "మావీరన్" అనే చిత్రం తెలుగులో "మహావీరుడు" గా రానుంది.
లేటెస్ట్ గా ఈ సినిమాలో శివకార్తికేయన్ ను జోడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి శంకర్ నటించబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అలానే ఒక ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ హీరోయిన్ సరిత నటించబోతుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa