ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టవల్ ధరించి ఉన్నా...

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 28, 2018, 03:24 PM

బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం జోరందుకునట్లు కనిపిస్తోంది. తనుశ్రీ దత్త వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దిగ్గజ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హార్న్ ఒకే ప్లీజ్ షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనని లైగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై బాలీవుడ్ లో చర్చ జరుగుతుండగానే తనుశ్రీ మరో బాంబు పేల్చింది. తనుశ్రీ దత్త నటించిన చాక్లెట్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి షూటింగ్ సమయంలో నీచంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.


తనుశ్రీ దత్త ఆషిక్ బనాయా అపనే చిత్రంలో శృంగార సన్నివేశాలలో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత పలు బాలీవుడ్ చిత్రాల్లో తనుశ్రీ నటించింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కొన్ని రోజులుగా తనుశ్రీ వార్తలో ప్రధాన అంశంగా మారుతోంది.లైంగిక వేధింపుల గురించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బాలీవడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.


నానా పాటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ తాజగా చాక్లెట్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పై తీవ్రమైన వ్యాఖ్యలుచేసింది. చాక్లెట్ చిత్ర షూటింగ్ సమయంలో ఆ దర్శకుడు తనని వేధించిన వైనాన్ని బయట పెట్టింది.తాజాగా తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాక్లెట్ షూటింగ్ జరుగుతోంది. తాను ధరించిన కాస్ట్యూమ్స్ ఎక్స్పోజింగ్ గా ఉండడంతో పైన టవల్ లాంటి కోట్ ధరించి కూర్చుని ఉన్నా. ఆ సమయంలో ఇర్ఫాన్ ఖాన్ పై షాట్ చిత్రీకరించాలి. అయినా కూడా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన వక్ర బుద్ది చూపించారు.ఇర్ఫాన్ ఖాన్ కి సెక్సీగా ముఖ కవళికలు చూపించాలి. టవల్ తీసేసి డాన్స్ చేయి అని నీచంగా మాట్లాడాడు. ఆ షాట్ లో నేను ఉండను. ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే కనిపిస్తాడు. నేను పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దర్శకుడు మరో ఉద్దేశంతో మాట్లాడాడు అని తనుశ్రీ మండి పండింది.


 


వెంటనే నటుడు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి స్పందించి నాకు అండగా నిలిచారు. దర్శకుడిని అడ్డుకున్నారు. ఈ షాట్ తనుశ్రీ ఉండవలసిన అవసరం లేదు. ఆమె ముఖకవళికలు లేకున్నా నేను నటిస్తా అంటూ ఇర్ఫాన్ ఖాన్ దర్శకుడిని మందలించారు.ఇర్ఫాన్ ఖాన్, సునీల్ నా కోసం అలా మాట్లాడడం చాలా నచ్చిందని తనుశ్రీ వారిద్దరిని ప్రశంసించింది. తనుశ్రీ నటించే షాట్ కాదు. ఆమె డాన్స్ చేయవలసిన అవసరం లేదు. ఇర్ఫాన్ ఖాన్ ఎలా కావాలంటే అలా నటిస్తాడు అని సునీల్ శెట్టి స్పందించారు.తనుశ్రీ వ్యాఖ్యలపై నానా పాటేకర్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా వంటి బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తనుశ్రీకి మద్దత్తు ప్రకటిస్తున్నారు. దీనితో బాలీవుడ్ లో కూడా మీ టూ క్యాంపైన్ జోరందుకునేలా కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa