1994లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాలో ఉన్న ‘ఊర్వశి ఊర్వశి’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. లేటెస్ట్‌గా ఈ పాటను హిందీలో రీమిక్స్ చేశారు. ప్రముఖ నిర్మాత టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ పాటను నిర్మించారు. డైరెక్టర్ గిఫ్టీ ఈ పాటను డైరెక్ట్ చేశాడు. ‘ఊర్వశి’..టేక్ ఇట్ ఈజీ రీమిక్స్ వెర్షన్‌ను ఈ రోజు విడుదల చేశారు.
ఈ రీమిక్స్ పాటలో షాహిద్ కపూర్ సరసన కియార అద్వానీ నటించింది. ప్రెజెంట్ వీళ్లిద్దరు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో కలిసి నటిస్తున్నారు. యో యో హనీ సింగ్ ఈ పాటను కంపోజ్ చేసి పాడడం విశేషం.. పాటలో మిగతా లిరిక్స్ అన్ని మార్చి కేవలం ‘ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ అనే లిరిక్ మాత్రమే తీసుకున్నారు. ఓ నైట్ క్లబ్ నేపథ్యంలో ఈ రీమిక్స్ పాటను పిక్చరైజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa