తెలుగులో హీరో బాలకృష్ణ సరసన ‘పరమ వీర చక్ర’ సినిమాలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా ఆమధ్య నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తల్లికాబోతున్నారు. ఈ నేపధ్యంలో నిన్న ముంబైలో సినీ ప్రముఖుల మధ్య ఆమెకు సీమంత ఉత్సవం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కరీనాకపూర్ ఖాన్, సోహా అలీఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సీమంతం కార్యక్రమానికి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తె జాన్వీ, కరణ్ జోహర్, సోనాక్షీ సిన్హా(‘లింగా’ హీరోయిన్), హుమా కురేషీ తదితరులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa