శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాలో నటిస్తుంది. జాన్వీ తెలుగులో కూడా సినిమా చేయనుందని టాక్ నడుస్తుంది.ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా జాన్వీ స్పందించింది. నాకు తెలుగు సినిమా లేదా ఏదైనా సౌత్ సినిమా చేయాలనే ఆసక్తి ఉంది. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రావడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు. అతను ఒక లెజెండ్.అయితే మీరు అనుకున్నట్లుగా ఆయన సినిమాలో నాకు అవకాశం రాలేదు అని తెలిపింది.