రక్త చరిత్ర, లెజెండ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే. టాలీవుడ్‌లో తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తెలుగులో ఓ ప్రముఖ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. సినిమా షూటింగ్‌లో రిహార్సల్స్ చేస్తుండగా తనను హీరో గిల్లాడని తెలిపింది. హీరో పేరును ఆమె చెప్పలేదు. దీంతో ఆ హీరో ఎవరో అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.