మాచో స్టార్ గోపీచంద్, ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా జంటగా నటించిన మూడో చిత్రం "పక్కా కమర్షియల్". మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, సప్తగిరి, శ్రీనివాస్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. జూలై 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు ఓటిటి "ఆహా" లో నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో గోపీచంద్ కామెడీ అండ్ యాక్షన్ మిస్ ఐన వాళ్ళు ఆహాలో ఈ మూవీని చూడవచ్చు. థియేటర్ రన్ లో ఉసూరుమనిపించిన ఈ చిత్రం డిజిటల్ లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.