హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం "సీతారామం". వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5న అంటే ఈరోజే విడుదలైంది. ఈ చిత్రంలో రష్మిక మండన్నా , సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలు పోషించగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా సీతారామం అఫీషియల్ డిజిటల్ పార్టనర్ ఎవరనేది తెలుస్తుంది. ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో సీతారామం డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
![]() |
![]() |