చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఇండియాస్ మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "కార్తికేయ 2". అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
కొంచెం సేపటి క్రితమే ఈ మూవీ యొక్క హిందీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. శనివారం విడుదలైన తెలుగు ట్రైలర్ స్టన్నింగ్ విజువల్స్ తో, సూపర్ బీజీఎమ్ తో టెర్రిఫిక్ గా సాగింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఆగస్టు 13వ తేదీన అంటే ఈ శనివారం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల అటు నార్త్, ఇటు సౌత్ లోను మంచి వైబ్స్ వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa