మాస్ యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన ప్రేమ కథ "సీతారామం". హను రాఘవపూడి డైరెక్షన్లో హార్ట్ టచింగ్ ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై, రోజు రోజుకు కలెక్షలను బెటర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక, ఓవర్సీస్ లో ఐతే, ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా కలెక్షన్లు మూడు రోజుల్లో హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హను రాఘవపూడి మాస్టర్ స్టోరీ టెల్లింగ్ ను, దుల్కర్ , మృణాల్ ల అద్భుతమైన నటనను, విశాల్ చంద్రశేఖర్ మెలోడీని మెచ్చుకుంటూ, సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa