ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసును పట్టేస్తోన్న 'పడిపడి లేచె మనసు' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 10, 2018, 11:18 AM

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడి గురించి చెప్పుకోకవచ్చు. ఆయన తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' రూపొందింది. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. నాయాకా నాయికల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.


ఈ సినిమాలో మెడికోగా సాయిపల్లవి కనిపిస్తోంది. శర్వానంద్ ఆమెను ఫాలో చేయడం .. అది గమనించి ఆమె నిలదీయడం ఈ టీజర్ లో చూపించారు. యూత్ ఆశించే ఫీల్ కంటెంట్ లో కనిపిస్తోంది. సినిమాపై వాళ్లలో ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటు శర్వానంద్ .. అటు సాయిపల్లవి ఇద్దరూ కూడా విభిన్నమైన కథాంశాలను ఎంచుకునేవారే గనుక, అందరిలోను అంచనాలు వున్నాయి.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa