డైరెక్టర్ సురేందర్ రెడ్డి నుంచి రాబోతున్న క్రేజీ చిత్రం ఏజెంట్. యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తున్న ఈ మూవీలో హీరో అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ చేస్తుండగా..సాక్షి వైద్య కథానాయికగా చేస్తుంది. కాగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఏజెంట్‌లో పాపులర్ బాలీవుడ్ నటుడు, నిర్మాత డినో మోరియా కీలకపాత్రలో నటిస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.