కొణిదెల హీరో పవన్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, యాంకర్ మేఘన మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను పవన్‌తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని' రాసుకొచ్చాడు. కాగా పవన్ తేజ్‌కు చిరంజీవి బాబాయ్ అవుతాడు.