టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పేరు ఇప్పుడు ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. గురువారం ఒక్కరోజులో ఆయనకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్ చేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఆయన నిర్మాణ సారథ్యంలో వస్తున్న రామ్ చరణ్, శంకర్ ల సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వాలంటూ అభిమానులు ఈ ట్వీట్స్ చేశారు. దిల్ రాజు గారూ.. దయచేసి అప్‌డేట్‌లు ఇవ్వండి అంటూ ట్వీట్స్ చేయడంతో ఆయన పేరు ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.