ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమైరాకి త‌ప్ప‌ని లైంగిక వేధింపులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 11, 2018, 11:12 AM

హీరోయిన్ అమైరా ద‌స్తూర్ మీ టూ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. సినీ రంగంలో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి బాధితులు పెద‌వి విప్పాల‌ని పిలుపు ఇచ్చింది.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలున‌ని వాపోయింది.. ‘ఇష్క్‌’ సినిమాతో 2013లో బాలీవుడ్‌కు పరిచయం అమైరా ‘మిస్టర్‌ ఎక్స్‌’, ‘కాలాకండి’, ‘కుంగ్‌ఫూ యోగా’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘మనసుకు నచ్చింది’, ‘రాజు గాడు’ సినిమాల్లో ఆమె కథానాయిక. త‌మ‌ళంలో రెండు మూవీలు చేసింది.. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా.. ఆమె స్పందిస్తూ, . ‘నిజాయతీగా చెప్పాలంటే నాకు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదురుకాలేదు. కానీ రెండు మూవీ బ్యాన‌ర్ లో వేధింపులు ఎదుర్కొన్నాను. వారి పేర్లు చెప్పే ధైర్యం నాకు లేదు.. ఎందుకంటే వారు పవర్ ఫుల్‌ వ్యక్తులు. కానీ కచ్చితంగా ఓ రోజు వారి గురించి బయటపెడుతా. వారికి తెలుసు.. వారు ఏం చేశారో. వారికి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా.. ఇకపై అయినా వేధించడం ఆపండి. 


రోజులు మారాయి.. మీ కర్మ నుంచి మీ పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని కాపాడలేని రోజులు వస్తున్నాయి’ అని తెలిపింది. .. ‘ఓ సినిమా పాట షూటింగ్‌ సమయంలో నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, నన్ను తడిమాడు. నా చెవి దగ్గరికి వచ్చి.. ‘ఈ సినిమా కోసం నీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అన్నాడు. నేను అతడ్ని పక్కకు నెట్టా. అప్పటి నుంచి మాట్లాడటం మానేశా. ఆ తర్వాత నేను చాలా చేదు అనుభవాలు ఎదుర్కొనేలా అతడు చేశాడు’. ‘నటుడితో చనువుగా ఉండమని దర్శకుడు నాతో చెప్పాడు. నన్ను సెట్‌కు త్వరగా రమ్మని పిలిచేవారు. నా షూట్‌ కోసం గంటలు గంటలు ఎదురు చూసేలా చేసేవారు. రోజుకు 18 గంటలు సెట్‌‌లోనే ఉండేదాన్ని. దర్శకుడు కావాలనే రోజూ షూట్‌‌లో అరిచేవాడు. నన్ను సెట్‌కు రమ్మని.. వ్యాన్‌లోనే 12-13 గంటలు వెయిట్‌‌ చేయించేవారు. తర్వాత సహాయ దర్శకుడ్ని పంపి ఇవాళ మీ షూట్‌ లేదు అని చెప్పించేవాడు. ఈ సినిమాకు నిన్ను తీసుకోవడమే నీ అదృష్టం అని దర్శకుడు అనేవాడు’. ‘నటుడికి క్షమాపణలు చెప్పమని నిర్మాత న‌న్ను కోరాడు.వ‌త్తిడి మీద చివరికి ఆ న‌టుడికి క్షమాపణలు చెప్పా’ అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa