"మహానటి"తో జాతీయ అవార్డును గెలుపొందిన కీర్తి సురేష్ ఆపై దక్షిణాది టాప్ హీరోయిన్ గా వరస క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను కొట్టేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కీర్తి పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాలనుకుంది కానీ, మహానటి తరవాత కీర్తి నటించిన ఏ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఆశించిన విజయం సాధించలేదు.
ఇటీవల విడుదలైన సాని కాదియన్ ఫరవాలేదనిపించుకోగా, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి...ఇవేవీకూడా హిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో కీర్తి మరొక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ "సురారై పొట్రు" డైరెక్టర్ సుధా కొంగర, మహానటి కీర్తి సురేష్ తో ఒక సినిమా చెయ్యబోతుందని టాక్ . ఇదొక ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అని కూడా అంటున్నారు. దీంతో కీర్తి కి అస్సలు అచ్చుబాటు రాని జోనర్ లో పదే పదే సినిమాలెందుకు చేస్తుందని? ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.
![]() |
![]() |