కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారంలోగా అప్ డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ మధ్య ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సలార్ అప్ డేట్ రాబోతుంది. పంద్రాగస్టు కానుక బిగ్ అప్ డేట్ ఇవ్వబోతు న్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతిహా సన్ నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమా రన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బసూర్ సంగీతం. హోంబలే ఫిల్మ్ నిర్మిస్తోంది.