వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. ప్రదీప్ వర్మ దర్శక త్వంలో ఆయన తెరకెక్కుతున్న సినిమా 'అల్లూరి' రిలీజ్ డేట్ ఫిక్సయింది. సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నట్టు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ కూడా పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఇందులో చేతిలో బల్లెం పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ చిత్రానికి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. లక్కీ మీడియా నిర్మిస్తోంది.