విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ వస్తున్న 'లైగర్' ఈ నెల 25న విడుదల కానుంది. ఆదివారం వరంగల్ లో 'ఫ్యాన్ డమ్ టూర్' నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ 'విజయ్ లో నాకు బాగా నచ్చింది అతని నిజాయితీ. మాటల్లోనే కాదు, యాక్టింగ్‌లోనూ నిజాయితీ ఉంటుంది. మాకు అప్పులున్నాయని తెలిసి, మేమిచ్చిన రూ.2 కోట్లు తిరిగిచ్చేసి అప్పులు తీర్చమన్నాడు. ఈరోజుల్లో అలాంటి హీరోలెవరుంటారు' అని అన్నారు.