ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుండి స్పెషల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 15, 2022, 10:35 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ తన సొంత బ్యానర్ రామ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (SRFI) లో 15వ ప్రాజెక్టుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఐశ్వర్య టాలీవుడ్ రంగప్రవేశం చేయబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు SRFI చీఫ్, నటుడు అర్జున్ పుట్టినరోజు కావడంతో SRFI 15 టీం అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని అధికారికంగా తెలిపారు. పోతే, ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com