భారతదేశపు తొలి అతి పిన్న వయస్సు స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరాం బోస్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం "ఖుదీరాం బోస్". వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరగ్గా, ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా విడుదలయ్యాయి.
ఈ సినిమాను విద్యాసాగర్ రాజు డైరెక్ట్ చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గోల్డెన్ రైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జాగర్లమూడి రజిత విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ భాషలలో ఈ సినిమా నిర్మింపబడుతుంది.