"బిచ్చగాడు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ ఆంథోనీ నటిస్తున్న కొత్త చిత్రం "హత్య". ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగా, లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.
నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా, ఈరోజు సాయంత్రం ఆరింటికి హత్య ట్రైలర్ విడుదల కానున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేసారు.
ఈ సినిమాకు బాలాజీ కుమార్ డైరెక్టర్ కాగా, "గురు"ఫేమ్ రితిక సింగ్ హీరోయిన్. మీనాక్షి చౌదరి కీరోల్ లో నటిస్తుంది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.