ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన మల్టీ లింగువల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం "గార్గి". గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాక కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతిక, తెలుగులో హీరో రాణా సమర్పించడం విశేషం.
లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేసినట్టు తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి సోనీ లివ్ లో గార్గి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది.
ఈ సినిమాలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, శివాజీ, శరవణన్, జయప్రకాశ్ తదితరులు నటించారు.