కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ , తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో "వారసుడు" అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో "వారిసు" అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ నిమిత్తం తెలుగు రాష్ట్రాలలో స్టే చేస్తున్న విజయ్ నిన్న హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో "కార్తికేయ 2" మూవీని చూసారు.
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్షన్లో మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా గత శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఉత్తరాదిన కూడా ఈ సినిమా రోజురోజుకూ థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతూ, బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
మరి, ఈ సినిమాను చూసిన విజయ్ తన అభిప్రాయాన్ని తెలుపుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.