బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడినట్లు 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. రాహుల్ తన పనితనాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి మెసేజ్ చేశాడని, తనని పర్సనల్ స్టైలిస్ట్‌గా నియమించుకుంటానని చెప్పి కలవమన్నాడని, ఈ క్రమంలో అతడి ఫ్లాట్‌కి వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.