టీవీ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఉర్ఫీ జావేద్ తన ఫోటో, వాట్సాప్ సందేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రెండేళ్లుగా ఆ వ్యక్తి తనను వేధిస్తున్నాడని, మార్ఫింగ్ ఫొటోతో బెదిరిస్తున్నాడని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది. తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లో అతడి ఫొటోను, వాట్సాప్ మెసేజ్ లను ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి రెండేళ్లుగా శృంగారం చేయమని వేధిస్తున్నాడని, మార్ఫింగ్ ఫొటోతో బెదిరిస్తున్నాడని పేర్కొంది.